ఇండిగో ప్యాకేజ్డ్‌ ఆహారంలో అధిక ఉప్పు!

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది.

Published : 19 Apr 2024 03:56 IST

నిర్దేశిత ప్రమాణాల మేరకే సోడియం ఉందన్న సంస్థ

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. దీనిపై వివరణ ఇస్తూ ఓ ప్రకటనను విడుదల చేసింది. తమ సంస్థ వినియోగించే ఆహారంలో నిర్దేశిత ప్రమాణాల స్థాయిలోనే ఉప్పు ఉంటుందని వివరణ ఇచ్చింది. ఫుడ్‌ ఫార్మర్‌ పేరిట వీడియోలు చేసే రేవంత్‌ హిమత్సింకా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఇండిగో అందించే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో సోడియం మోతాదు ఉందని అందులో పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. తాము ప్రసిద్ధి చెందిన విక్రేతల నుంచే ప్రీ ప్యాకేజ్డ్‌ లేదా తాజా ఆహారాన్ని సేకరిస్తున్నామని ఇండిగో వివరించింది. తమ సేవలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ తరహా అభిప్రాయాలను గౌరవిస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు