నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!

ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది.

Published : 19 Apr 2024 03:57 IST

125 మంది అరెస్టు
కేంద్ర హోం శాఖ నివేదిక వెల్లడి

దిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. దేశంలో 2004-14తో పోలిస్తే 2014-23లో వామపక్ష తీవ్రవాద హింస 52 శాతం, మరణాల సంఖ్య 69శాతం తగ్గాయని పేర్కొంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు ఆపరేషన్‌లు చేపట్టాలని గతేడాది కేంద్రమంత్రి అమిత్‌ షా భద్రతా బలగాలకు నిర్దేశించడంతో శక్తిమంతమైన మావోయిస్టు వ్యతిరేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో డీజీపీలు, సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ల డైరెక్టర్‌ జనరల్‌లు, ఇండో-టిబెటియన్‌ బార్డర్‌ పోలీసులు, ఇంటెలిజన్స్‌ బ్యూరో అధికారులున్నారు. ముందస్తు ఆపరేషన్‌ల ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని అధికారి ఒకరు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని