హిమాచల్‌లో గ్రామానికి తొలిసారి మొబైల్‌ సౌకర్యం

హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్‌లో ముచ్చటించారు.

Published : 19 Apr 2024 03:58 IST

గీవు వాసులతో మాట్లాడిన ప్రధాని మోదీ

దిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్‌లో ముచ్చటించారు. దీపావళి పండగ సందర్భంగా తాను సరిహద్దు ప్రాంతానికి వెళ్లడం తదితర విషయాలను వారితో పంచుకున్నారు. గీవు గ్రామాన్ని మొబైల్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ‘డిజిటల్‌ ఇండియా ప్రచారాన్ని’ వేగవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుదీకరణ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇప్పుడు అన్ని ప్రాంతాలను కమ్యూనికేషన్‌ టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో 18,000 గ్రామాలకు విద్యుత్తు సదుపాయం లేదని ప్రస్తావించారు. తమ గ్రామాన్ని మొబైల్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తున్నట్లు చెప్పినప్పుడు ఏమాత్రం నమ్మలేదని, ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చడంతో తమ ఆనందానికి అవధుల్లేవని గ్రామస్థుడు ఒకరు మోదీతో అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని