నిన్న అమీర్‌ఖాన్‌.. నేడు రణ్‌వీర్‌సింగ్‌

లోక్‌సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి.

Published : 19 Apr 2024 05:02 IST

ఎన్నికల వేళ ‘డీప్‌ఫేక్‌’ బాధితులు

ముంబయి: లోక్‌సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా ఇటీవల బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ వీడియో వైరల్‌ కాగా, తాజాగా మరో నటుడు రణ్‌వీర్‌ సింగ్‌కు అదే పరిస్థితి ఎదురైంది. నెట్టింట్లో వైరల్‌ అవుతున్న రణ్‌వీర్‌ వీడియోలో ఆయన ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్టు ఉంది. రణ్‌వీర్‌ ఇటీవల వారణాసిలో పర్యటించారు. అక్కడి నమోఘాట్‌ వద్ద ఆయనతోపాటు నటి కృతిసనన్‌ ఫ్యాషన్‌ షోకు పోజులిచ్చారు.అంతకుముందు కాశీ విశ్వనాథుడిని సందర్శించుకున్నారు. తర్వాత ఆధ్యాత్మిక నగరంలో పొందిన అనుభూతిని మీడియాకు వివరించారు. ఈ దృశ్యాలనే వాడిన ఏఐ వీడియోలో రణ్‌వీర్‌ ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తన గురించి వచ్చిన డీప్‌ఫేక్‌ వీడియోపై అమీర్‌ఖాన్‌ ఇదివరకే స్పష్టత ఇచ్చారు. తాను ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేయలేదంటూ ముంబయి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక రణ్‌వీర్‌ స్పందించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు