ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్‌ విలేజ్‌

ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్‌లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్‌పుర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది.

Published : 20 Apr 2024 05:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్‌లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్‌పుర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మంచు పర్వతాల్లో ఉన్న ఈ గ్రామంలో 105 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 55 కుటుంబాల్లో కనీసం ఒకరు పుట్టుకతో మూగ లేదా చెవుడు సమస్యను ఎదుర్కొంటున్నవారే. మొత్తంగా ఊరిలో 84 మంది బధిరులు ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, 14 మంది పదేళ్లలోపు చిన్నారులే. అందుకే ఈ గ్రామానికి ‘సైలెంట్‌ విలేజ్‌’గా పేరొచ్చింది. ఈ గ్రామస్తులు, ముఖ్యంగా బధిరులు శుక్రవారం సార్వత్రిక ఎన్నికల తొలి విడతలో ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో అనేక మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం విశేషం. అన్ని వనరులు ఉన్నా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలంటేనే బద్ధకిస్తున్న జనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఓటుహక్కును వినియోగించుకోవడం ద్వారా ఇక్కడి బధిరులు గొప్ప స్ఫూర్తిని చాటారు. 

 ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌లో 56 గ్రామాల ప్రజలు తొలిసారిగా తమ సొంత ఊళ్లలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని