ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు

మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది.

Published : 20 Apr 2024 05:59 IST

బెంగళూరు: మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. వార్ధక్యంతో వచ్చే సవాళ్లను అధిగమించడం కూడా దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్టుకు ‘లాంజెవిటీ ఇండియా ఇనీషియేటివ్‌’ అని పేరు పెట్టారు. ఇందులో ఐఐఎస్‌సీలోని వివిధ శాఖలతోపాటు వైద్యులు, పరిశ్రమలు, దాతృత్వ సంస్థలు, పౌర సమాజం పాలుపంచుకోనున్నాయి. పరిశోధనల ద్వారా వార్ధక్యానికి సంబంధించిన అంశాలపై అవగాహనను మెరుగుపరచుకోవాలనుకుంటున్నట్లు ఐఐఎస్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. యాక్సెల్‌ ఇండియా వ్యవస్థాపక భాగస్వామి ప్రశాంత్‌ ప్రకాశ్‌ నుంచి దీనికి ఇప్పటికే నిధుల తోడ్పాటు కూడా అందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు