అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది.

Published : 20 Apr 2024 06:03 IST

మొదటి ర్యాంకర్‌కు 54.27 శాతం

దిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ఇలా మూడు దశల్లో నిర్వహించే ఈ పరీక్ష మొత్తంగా 2025 మార్కులకు జరుగుతుంది. మొదటి ర్యాంకు సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ 1099 మార్కులు (రాత పరీక్షలో 899, ఇంటర్వ్యూలో 200) సాధించినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. రెండో ర్యాంకు సాధించిన అనిమేశ్‌ ప్రధాన్‌ 1067 మార్కులు (రాత పరీక్షలో 892, ఇంటర్వ్యూలో 175), మూడో ర్యాంకు సాధించిన అనన్య రెడ్డి 1065 మార్కులు (రాత పరీక్షలో 875, ఇంటర్వ్యూలో 190) పొందినట్లు పేర్కొంది. నీ ఏళ్లపాటు కష్టపడి త్రుటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్‌ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. వారికోసం ప్రత్యేక నియామక ప్రక్రియను రూపొందించినట్లు డిట్టో ఇన్సూరెన్స్‌ సహ-వ్యవస్థాపకుడు భాను హరీశ్‌ గుర్రం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు