వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు

వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Updated : 20 Apr 2024 06:11 IST

బొంబాయి హైకోర్టు స్పష్టీకరణ

ముంబయి: వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంచి భార్య కాలేకపోవడం మంచి తల్లి కాలేరన్న అర్థం కాదంటూ ఓ తొమ్మిదేళ్ల బాలిక బాధ్యతను తల్లికి అప్పగించింది. తన నుంచి విడిపోయిన భార్యకు కుమార్తె కస్టడీని అప్పగిస్తూ 2023లో ఓ కుటుంబ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఓ మాజీ శాసనసభ్యురాలి కుమారుడు బొంబాయి హైకోర్టులో సవాలు చేశారు. పిటిషనర్‌కు 2010లో వివాహం అయింది. 2015లో కుమార్తె జన్మించింది. 2019లో తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని మహిళ పేర్కొంది. మరోవైపు, పిటిషనర్‌ మాత్రం.. తన భార్య ఆమె ఇష్టప్రకారమే ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆరోపించారు. మహిళకు అనేక మందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని, కాబట్టి కుమార్తె బాధ్యతలను ఆమెకు అప్పగించడం సరికాదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ న్యాయస్థానానికి విన్నవించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ పాటిల్‌.. పిల్లల కస్టడీ విషయంలో తల్లి వివాహేతర సంబంధాల ఆరోపణలకు ఏమాత్రం సంబంధం ఉండదని స్పష్టంచేశారు. తండ్రి అభ్యర్థనను తిరస్కరించారు. విడాకులకు చూపే కారణంతో పిల్లలను కస్టడీకి అప్పగించలేమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు