మూడు రోజుల్లో తేల్చాలి

ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

Published : 20 Apr 2024 06:11 IST

ఓటరు చైతన్యయాత్రలకు అనుమతిపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశం

దిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. అటువంటి కార్యక్రమాలకు అనుమతి కోరుతూ వచ్చిన అభ్యర్థనలపై సంబంధిత అధికారులు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలంటూ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక ఉద్యమ కార్యకర్తలు అరుణా రాయ్‌, నిఖిల్‌ డే దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. శాంతిభద్రతల పరిరక్షణకు ఉద్దేశించిన సెక్షన్‌ 144 ద్వారా లభించిన అధికారాలను అధికార యంత్రాంగాలు విచక్షణారహితంగా దుర్వినియోగం చేస్తున్నాయని పిటిషనర్లు ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని