తిరస్కృత నామినేషన్లపై పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  

Published : 20 Apr 2024 06:07 IST

దిల్లీ: తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.   బిహార్‌లోని బాంకా లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి ఏకపక్షంగా తిరస్కరించారని ఆరోపిస్తూ బిహార్‌కు చెందిన జవహర్‌ కుమార్‌ ఝా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికిప్పుడు ధర్మాసనం జోక్యం చేసుకున్నా విచారణ పూర్తవడానికి చాలా సమయంపడుతుందని, ఎన్నికల ప్రక్రియకు అవరోధం కల్పించబోమంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం శుక్రవారం పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని