మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా

బెయిల్‌ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘాటుగా స్పందించారు.

Published : 20 Apr 2024 06:11 IST

నా ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోంది
కోర్టుకు తెలిపిన కేజ్రీవాల్‌

దిల్లీ: బెయిల్‌ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘాటుగా స్పందించారు. తన ఆహారంపై ఈడీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. బెయిల్‌ కోసం తాను పక్షవాతం తెచ్చుకునేందుకు సిద్ధపడతానా? అని మండిపడ్డారు. ఈడీ ఆరోపణలన్నీ అసత్యమని కొట్టిపారేశారు. అరెస్టుకు ముందు వైద్యుడు సిఫారసు చేసిన డైట్‌ ఛార్ట్‌ మేరకే జైలులో ఆహారం తీసుకుంటున్నానని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఆందోళన కలిగించే చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకునేందుకు తనకు ఇన్సులిన్‌ వెసులుబాటు కల్పించమని తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ కేజ్రీవాల్‌ శుక్రవారం కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 48 సార్లు తనకు ఇంటి నుంచి భోజనం వస్తే అందులో మూడు సార్లే మామిడి పండ్లు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. తేనీరులో కృత్రిమ చక్కెరను మాత్రమే తీసుకుంటానని, దుర్గా పూజ రోజున ఆలూ పూరీని తిన్నానని కోర్టుకు కేజ్రీవాల్‌ విన్నవించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు