తీవ్రమవుతున్న వేసవి తాపం

దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి తాపం పెరుగుతోంది. శనివారం అనేకచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యాయి.

Published : 21 Apr 2024 06:34 IST

దిల్లీ: దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి తాపం పెరుగుతోంది. శనివారం అనేకచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నెలకొన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దేశంలో ఈ నెలలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం ఇది రెండోసారి. తొలి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి తాపం తీవ్రమైంది. ఎల్‌నినో పరిస్థితులు బలహీనపడుతున్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఉష్ణోగ్రతలు పెరగొచ్చని ఐఎండీ ఇప్పటికే హెచ్చరించింది. 10-20 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉండొచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో అది 20 రోజుల కన్నా ఎక్కువగా కొనసాగొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని