ఏడాది చివరిలోగా పూర్తవనున్న అయోధ్య రామమందిర నిర్మాణం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర నిర్మాణం డిసెంబరులోగా పూర్తవనుంది. కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి మూడు అంతస్తుల పనులను ఏడాది చివరిలోగా పూర్తి చేయాలని ఆలయ ట్రస్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 21 Apr 2024 05:21 IST

అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర నిర్మాణం డిసెంబరులోగా పూర్తవనుంది. కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి మూడు అంతస్తుల పనులను ఏడాది చివరిలోగా పూర్తి చేయాలని ఆలయ ట్రస్ట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం వేలాది మంది కార్మికులను నియమించారు. స్తంభాల్లో విగ్రహాలను చెక్కేందుకు 200 మంది కళాకారులను, మూడు అంతస్తుల్లో పనులు చేసేందుకు దాదాపు 1200 మంది కార్మికులను ఇప్పటికే నియమించగా వీరి సంఖ్యను త్వరలోనే 5వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. గర్భగుడిలో రామ్‌ దర్బార్‌తో పాటు రామజన్మభూమి కాంప్లెక్స్‌లో మరో ఎనిమిది ఆలయాలను ఏర్పాటు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని