శరత్‌చంద్రారెడ్డి భాజపాకు రూ.60 కోట్లు ఇచ్చారు.. అయినా ఈడీ చర్యలు చేపట్టలేదు: సంజయ్‌

మద్యం కుంభకోణం నిందితుడి నుంచి ఎలక్టోరల్‌ బాండ్లు తీసుకున్న భాజపాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ శనివారం ఆరోపించారు.

Published : 21 Apr 2024 05:22 IST

దిల్లీ: మద్యం కుంభకోణం నిందితుడి నుంచి ఎలక్టోరల్‌ బాండ్లు తీసుకున్న భాజపాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాజ్యసభ సభ్యుడు సంజయ్‌సింగ్‌ శనివారం ఆరోపించారు. ఒకవేళ దేశంలో రెండు చట్టాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఈ మేరకు శనివారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా.. మద్యం కుంభకోణంలో తనను, ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను, మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేశారని ఆరోపించారు. ‘‘మద్యం కుంభకోణానికి సంబంధించిన అభియోగపత్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రధాన సూత్రధారిగా పేర్కొన్న శరత్‌చంద్రారెడ్డి ఎలక్టోరల్‌ బాండ్ల మార్గంలో భాజపాకు రూ.60 కోట్లు ఇచ్చారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని