ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్‌డీ చేయొచ్చు

పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)కు హాజరుకావచ్చని ప్రకటించింది.

Published : 22 Apr 2024 04:33 IST

దిల్లీ: పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)కు హాజరుకావచ్చని ప్రకటించింది. జూనియర్‌ రీసర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) ఉన్నా లేకపోయినా..తమ డిగ్రీతో సంబంధం లేని ఏ సబ్జెక్టులోనైనా పీహెచ్‌డీని అభ్యసించవచ్చని తెలిపింది. అయితే దీనికోసం తమ నాలుగేళ్ల డిగ్రీలో విద్యార్థులు కనీసం 75 శాతం ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించే యూజీసీ-నెట్‌ పరీక్ష నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ ఆదివారం వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులకు 5 శాతం సడలింపు ఉండే అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని