మహారాష్ట్రలో దివ్యాంగ సిబ్బందితో పోలింగ్‌ కేంద్రాలు

సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది.

Published : 22 Apr 2024 04:33 IST

ఈటీవీ భారత్‌: సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్‌ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది. ప్రత్యేకంగా దివ్యాంగులు పనిచేసేలా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక ఎన్నికల అధికారి తెలిపారు. దీంతో జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున దివ్యాంగులతో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో దివ్యాంగ సిబ్బందికి మరో ఇద్దరిని సాయంగా నియమించనున్నారు. అంతేకాకుండా పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన ఓ పోలింగ్‌ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని