గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు

గాడిద పాలను విక్రయించి గుజరాత్‌కు చెందిన ధీరేణ్‌ సోలంకీ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు.

Published : 22 Apr 2024 06:25 IST

గుజరాత్‌ యువకుడి విజయగాథ

అహ్మదాబాద్‌: గాడిద పాలను విక్రయించి గుజరాత్‌కు చెందిన ధీరేణ్‌ సోలంకీ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. దీంతో కొన్ని ప్రైవేట్‌ సంస్థల్లో పని చేశారు. ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు అన్వేషించారు. దక్షిణ భారత్‌లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని తెలుసుకున్నారు. కొంత మందిని కలిసి సమాచారం సేకరించారు.

20 గాడిదలతో ప్రారంభం..

ఎనిమిది నెలల క్రితం 20 గాడిదలతో సొంత గ్రామంలోనే ధీరేణ్‌ సోలంకీ ఫామ్‌ను ప్రారంభించారు. రూ.22 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఇప్పుడు అవి 42 గాడిదలయ్యాయి. వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్‌లోని ఖాతాదారులకు సరఫరా చేస్తున్నారు. నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు సంపాదిస్తున్నట్లు ధీరేణ్‌ సోలంకీ తెలిపారు. ‘తొలినాళ్లలో కాస్త కష్టంగానే అనిపించింది. గుజరాత్‌లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదు. దీంతో తొలి ఐదు నెలలు ఆదాయమేమీ రాలేదు. క్రమంగా దక్షిణ భారత్‌లోని ఖాతాదారులను సంప్రదించా. అక్కడ డిమాండ్‌ బాగా ఉంది. ఇప్పుడు కర్ణాటక, కేరళకు ఈ పాలను సరఫరా చేస్తున్నాను. సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి’’ అని సోలంకీ వివరించారు. గాడిద పాలు ఒక లీటర్‌ ధర రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఉన్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని