ఛత్తీస్‌గఢ్‌ మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అనిల్‌ అరెస్టు

త్తీస్‌గఢ్‌లో రూ.2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది.

Published : 22 Apr 2024 04:43 IST

ఒకరోజు జ్యుడిషియల్‌ కస్టడీ విధించిన మేజిస్ట్రేట్‌
నేడు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్న ఈడీ

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో రూ.2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రానికి చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అనిల్‌ టుటేజాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసినట్లు అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. రాయ్‌పుర్‌లో శనివారం సాయంత్రం.. ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ), అవినీతి వ్యతిరేక సంస్థ(ఏసీబీ) మాజీ అధికారి అయిన అనిల్‌ టుటేజా, ఆయన కుమారుడు యశ్‌ టుటేజా నుంచి ఈడీ వాంగ్మూలం సేకరించింది. అనంతరం అనిల్‌ను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం సంబంధిత నగదు అక్రమ చలామణీ కేసులో రూ.2,161 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ‘‘అనిల్‌ టుటేజాను శనివారం రాత్రి ఈడీ అరెస్టు చేసింది. ఆదివారం ప్రత్యేక న్యాయస్థానం (పీఎంఎల్‌ఏ) సెలవు కావడంతో.. టుటేజాను సంబంధిత జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి 14 రోజుల కస్టడీ కోరింది. న్యాయస్థానం అనిల్‌కు ఒకరోజు జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. సోమవారం ఆయన్ను న్యాయస్థానంలో హాజరుపరుస్తాం’’ అని ఈడీ తరఫు న్యాయవాది సౌరభ్‌ పాండే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని