అవయవ మార్పిడిలో అక్రమాలపై కొరడా!

అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులపై దర్యాప్తు జరిపి, ఉల్లంఘనలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలకు స్పష్టంచేసింది.

Published : 22 Apr 2024 04:44 IST

నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై చర్యలు తీసుకోండి
రాష్ట్రాలకు కేంద్రం లేఖ

దిల్లీ: అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులపై దర్యాప్తు జరిపి, ఉల్లంఘనలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలకు స్పష్టంచేసింది. అలాంటి వైద్యశాలల రిజిస్ట్రేషన్‌ నిలిపివేత సహా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ గోయెల్‌ రాష్ట్రాలకు లేఖలు రాశారు. విదేశీయులు సహా అవయవ మార్పిడి చేయించుకున్న అందరి డేటాను ఎప్పటికప్పుడు సేకరించాలని, దాన్ని టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌వోటీటీవో)కు నెలవారీగా అందజేయాలని సూచించారు. హరియాణా, రాజస్థాన్‌లో బంగ్లాదేశ్‌ జాతీయులకు ప్రమేయమున్న అవయవ మార్పిడి రాకెట్‌ ఇటీవల వెలుగుచూసిన నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు. దేశంలో విదేశీయులకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరిగాయని, వీటిపై పర్యవేక్షణ అవసరమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని