సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల నిబద్ధత తిరుగులేనిది: నరేంద్ర మోదీ

సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా సివిల్‌ సర్వీసెస్‌ అధికారులందరికీ శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం.

Updated : 22 Apr 2024 07:16 IST

సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవం సందర్భంగా సివిల్‌ సర్వీసెస్‌ అధికారులందరికీ శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం. పాలన, ప్రజా సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారు కీలక పాత్ర  పోషిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు అమలు చేయడంలోనూ, సవాళ్లను అధిగమించి సామాజిక మార్పును తీసుకురావడంలోనూ వారు ముందంజలో ఉన్నారు.


మోదీ పాలనలో అధ్వానంగా రైల్వే వ్యవస్థ

-రాహుల్‌ గాంధీ

మోదీ పాలనలో రైలు ప్రయాణం శిక్షగా మారింది. సామాన్యులు ప్రయాణించే రైళ్లలో జనరల్‌ కోచ్‌లను తగ్గించి, ఉన్నత తరగతులకు మాత్రమే అందుబాటులో ఉండే రైళ్లను ప్రోత్సహిస్తోంది. దీనివల్ల రద్దీ విపరీతంగా పెరిగి టికెట్లు ఖరారైన ప్రయాణికులు కూడా తమ సీట్లలో కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. రైళ్లను అసమర్థ వ్యవస్థగా ముద్ర వేయడం ద్వారా, దాన్ని తన సన్నిహితులకు అమ్మేసేందుకు మోదీ యత్నిస్తున్నారు. రైల్వేను కాపాడాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.


ఉద్యోగ విప్లవాన్ని తీసుకొస్తాం

-మల్లికార్జున ఖర్గే

యువతకు ఉద్యోగ కల్పన అన్నది ఈ ఎన్నికల్లో కీలకాంశం కాబోతోంది. మోదీ వందల ర్యాలీల్లో పాల్గొంటున్నా, తమ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఎంత మందికి ఉద్యోగాలు కల్పించిందో చెప్పనేలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘యువ న్యాయ్‌’ పథకం ద్వారా ఉద్యోగ విప్లవాన్ని తీసుకొస్తాం. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఉద్యోగ నియామక పరీక్షల్లో ఎలాంటి అక్రమాలకు చోటులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని