అంకుల్‌.. మా బడిని ఇలా చేశారేంటి?

పోలింగ్‌ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్‌ అవుతోంది.

Updated : 23 Apr 2024 18:29 IST

పాఠశాలను అపరిశుభ్రం చేసిన ఎన్నికల అధికారులను ప్రశ్నించిన యూకేజీ విద్యార్థి

చెన్నై(ఆర్కేనగర్‌), న్యూస్‌టుడే: పోలింగ్‌ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్‌ అవుతోంది. చెన్నై కార్పొరేషన్‌ పరిధి ముగప్పేర్‌ వేణుగోపాల్‌ వీధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నిర్వహించారు. విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, ఏజెంట్లు మధ్యాహ్న భోజనం చేశాక.. ప్లేట్లు, కూల్‌డ్రింక్‌, నీటి సీసాలను బడిలో పడేసి వెళ్లారు. శనివారం పాఠశాలకు వచ్చిన పిల్లలు, ఉపాధ్యాయులు అది చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అహింస అనే యూకేజీ చదువుతున్న చిన్నారి మాత్రం తన బుజ్జిబుజ్జి మాటలతో అధికారులను నిలదీసినంత పని చేశారు. ‘అధికారులు మా బడిని ఇలా చేశారేంటి.? మీరు భోజనం చేసిన ప్లేట్లనూ తీయలేదు. మా బడిని మేం శుభ్రంగా ఉంచుకుంటాం.మీరూ అలాగే ఉంచాలని తెలియదా..?’ అంటూ ప్రశ్నించారు. ఇదంతా ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని