మణిపుర్‌లో మానవహక్కుల ఉల్లంఘన

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది.

Published : 23 Apr 2024 04:51 IST

అమెరికా నివేదికలో వెల్లడి

వాషింగ్టన్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘మానవ హక్కుల విధానాల’పై రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అప్పటి ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిగ్గుచేటని అభివర్ణించారని, చర్యలు చేపట్టాలని కోరారని తెలిపింది. బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (బీబీసీ)పై ఆదాయపు పన్ను దాడులు, గుజరాత్‌ న్యాయస్థానం రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్నీ ప్రస్తావించింది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఈ నివేదికను విడుదల చేశారు. మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి కొన్ని సానుకూల అంశాలను సైతం ఇందులో ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు