రాహుల్‌పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్‌ప్రదేశ్‌ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది.

Published : 23 Apr 2024 04:52 IST

సుల్తాన్‌పుర్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్‌ప్రదేశ్‌ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. సోమవారమే ఈ కేసుపై కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. న్యాయమూర్తిని కేటాయించకపోవడంతో విచారణను వాయిదా వేసినట్లు రాహుల్‌గాంధీ తరఫున హాజరైన న్యాయవాది కాశీ ప్రసాద్‌ శుక్లా తెలిపారు. 2018 ఆగస్టు 4న బెంగళూరులోని ఓ మీడియా సమావేశంలో అమిత్‌షాను కించపరిచేలా రాహుల్‌ గాంధీ మాట్లాడారంటూ ఆయనపై భాజపా నాయకుడు విజయ్‌ మిశ్ర పరువునష్టం కేసువేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని