అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ

వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్‌ నియమితులయ్యారు.

Published : 23 Apr 2024 04:52 IST

నయీమా ఖాతూన్‌ను నియమించిన కేంద్రం

దిల్లీ: వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నయీమా ఏఎంయూకు తొలి మహిళా వీసీ. అయిదేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ఏఎంయూలోనే సైకాలజీలో పీహెచ్‌డీ పూర్తిచేసిన నయీమా.. అదే విభాగంలో లెక్చరర్‌గా 1988లో ఎంపికయ్యారు. 2006లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందారు. 2014 నుంచి మహిళా కళాశాల ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్‌ మహమ్మద్‌ గుల్రెజ్‌ నిరుడు ఏఎంయూ తాత్కాలిక వీసీగా బాధ్యతలు చేపట్టారు. 1920లో బేగమ్‌ సుల్తాన్‌ జహాన్‌ ఏఎంయూ కులపతిగా పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని