అభిషేక్‌ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 23 Apr 2024 05:58 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని రాజరాం రేగే (50)గా గుర్తించి సోమవారం ముంబయిలో అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 26/11 ముంబయి ఉగ్రదాడిలో కీలక నిందితుడైన డేవిడ్‌ హెడ్లీతో అతడికి పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని