ఎట్టకేలకు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు తిహాడ్‌ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్‌ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు సోమవారం రాత్రి షుగర్‌ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్‌ ఇచ్చినట్లు తిహాడ్‌ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు.

Published : 24 Apr 2024 04:08 IST

రెండు యూనిట్లు ఇచ్చామన్న తిహాడ్‌ జైలు అధికారులు

దిల్లీ: దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు తిహాడ్‌ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్‌ ఇచ్చారు. కేజ్రీవాల్‌కు సోమవారం రాత్రి షుగర్‌ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్‌ ఇచ్చినట్లు తిహాడ్‌ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ క్రమంలో మంగళవారం హనుమజ్జయంతి నేపథ్యంలో భగవంతుడైన ఆంజనేయుడి ఆశీస్సులతోనే కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ దక్కిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అభివర్ణించింది. ‘‘ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజమేనని, ఆయనకు ఇన్సులిన్‌ అవసరమని నేడు స్పష్టమైంది. ఇన్సులిన్‌ అవసరం లేకపోతే మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు..? ప్రపంచం మొత్తం భాజపాను శపిస్తుండటమే అందుకు కారణం’’ అని దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని