తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం

దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా రూపొందించింది.

Published : 24 Apr 2024 05:40 IST

డీఆర్‌డీవో ఘనత

దిల్లీ: దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా రూపొందించింది. ఇది అత్యధిక స్థాయి ‘లెవల్‌ 6’ ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని ఓ అధికార ప్రకటన పేర్కొంది. దీని తయారీకి వినూత్న డిజైన్‌, పదార్థం, ప్రక్రియలను ఉపయోగించినట్లు తెలిపింది. కాన్పుర్‌లో డీఆర్‌డీవోకు చెందిన డిఫెన్స్‌ మెటీరియల్స్‌ అండ్‌ స్టోర్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఎంఎస్‌ఆర్‌డీఈ) దీన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇటీవల చండీగఢ్‌లోని ల్యాబ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఇది 7.62×54 ఆర్‌ ఏపీఐ తూటాలనూ నిలువరిస్తుందని అధికారులు తెలిపారు. దీని ముందు భాగం ఆరు స్నైపర్‌ తూటాలను అడ్డుకోగలదని చెప్పారు. దీన్ని మోనోలిథిక్‌ సిరామిక్‌ ప్లేటు, పాలిమర్‌తో తయారుచేసినట్లు వివరించారు. ఆపరేషన్ల సమయంలో ధరించడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని