గోరఖ్‌పుర్‌ భాజపా అభ్యర్థి రవికిషన్‌ నా తండ్రే

ప్రముఖ నటుడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్‌ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్‌ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.

Published : 24 Apr 2024 06:19 IST

నటి షినోవా సోనీ పిటిషన్‌

ఈటీవీ భారత్‌: ప్రముఖ నటుడు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్‌ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్‌ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష చేయించాలని కూడా ఆమె న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రవి కిషన్‌ తన భర్త అంటూ కొద్ది రోజుల క్రితం షినోవా తల్లి లఖ్‌నవూలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ వివాదంపై రవికిషన్‌ భార్య ప్రీతి స్పందించారు. తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని లేదంటే అత్యాచారం కేసులో ఇరికిస్తామంటూ గతేడాది షినోవా, ఆమె తల్లి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వీరిద్దరితోపాటు సమాజ్‌వాదీ పార్టీ నేత వివేక్‌ కుమార్‌ పాండే, యూట్యూబర్‌ ఖుర్షీద్‌ ఖాన్‌ రాజులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని