శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్‌ జోరు

శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్‌ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది.

Published : 24 Apr 2024 05:35 IST

దిల్లీ: శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్‌ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. ఝార్ఖండ్‌, బిహార్‌, బెంగాల్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మరింత కృషి చేయాల్సి ఉందని తెలిపింది. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎనర్జీ ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ ఎనాలసిస్‌ (ఐఈఈఎఫ్‌ఏ), ఎంబర్‌ సంస్థలు ఈ నివేదికను రూపొందించాయి. కర్ణాటక, గుజరాత్‌లు తమ విద్యుత్‌ రంగాల్లోకి పునర్‌వినియోగ ఇంధన వనరులను సమర్థంగా అనుసంధానం చేసుకుంటున్నాయని ఇది పేర్కొంది. కేరళ, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర.. శుద్ధ ఇంధనానికి సంబంధించిన కొన్ని అంశాల్లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధించినప్పటికీ.. కొన్ని విషయాల్లో పనితీరు సరిగా లేదని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని