వచ్చే ఏడాది భారత్‌కు ‘ఎస్‌-400’

రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్‌-400 ట్రైయాంఫ్‌ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది.

Published : 24 Apr 2024 05:36 IST

దిల్లీ: రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్‌-400 ట్రైయాంఫ్‌ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా సరఫరాల్లో జాప్యంతో ఈ వ్యవస్థలు మనదేశానికి అందడానికి ఆలస్యమవుతోంది. 5.5 బిలియన్‌ డాలర్ల ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి ఇప్పటికే మూడు దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు మనదేశానికి అందాయి. మరోపక్క రష్యా తయారీ యుద్ధనౌక తుషిల్‌ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి, తమల్‌ అనే మరో వార్‌షిప్‌ వచ్చే జనవరికి మనదేశానికి అందే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ రెండు నౌకలు 2022 నాటికే అందాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని