ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్‌డే!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్‌గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు.

Published : 25 Apr 2024 04:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్‌గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. విమాన సిబ్బంది వద్దకు వెళ్లి సాయం కోరాడు. బాలుడి విజ్ఞప్తికి స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ సిబ్బంది.. అతడి తల్లి పుట్టినరోజు వేడుకను విమానంలోనే జరిపి ఆమెను ఆశ్చర్యపరిచారు. జితీశ్‌ బిజుమాన్‌ అనే ఆ మహిళకు శుభాకాంక్షలు తెలుపుతూ విమానంలో ప్రత్యేక ప్రకటన చేశారు. అంతేకాదు.. అప్పటికప్పుడు చేతితో రాసిన శుభకామనల నోట్‌, ప్రత్యేక బహుమతి కూడా ఇచ్చారు. అనుకోని ఈ ఘటనతో ఆ తల్లి ఉక్కిరిబిక్కిరి అవుతుండగా సహ ప్రయాణికులందరూ కరతాళ ధ్వనులతో అభినందించారు. బాలుడు తన తల్లి వద్దకు చేరుకొని చిరునవ్వులు చిందించాడు. ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిలో ఒకరైన అఫ్జల్‌ఖాన్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. సామాజిక మాధ్యమంలో ఈ వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. బాలుడి ఆలోచనను, సిబ్బంది సహకరించిన తీరును కొనియాడుతూ నెటిజన్లు వ్యాఖ్యలు పెడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని