రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.

Published : 25 Apr 2024 04:05 IST

కోల్‌కతా: రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. గత నెలలో కోల్‌కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్‌ వారసుడిగా గౌతమానంద్‌జీ  బాధ్యతలు చేపట్టారు. మఠానికి సంబంధించిన ట్రస్టీల బోర్డు బుధవారం బేలూర్‌ మఠంలో సమావేశమై 95 ఏళ్ల గౌతమానంద్‌జీని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని