సంజయ్‌ రౌత్‌ సన్నిహితుడి ఆస్తుల జప్తు

శివసేన (ఉద్ధవ్‌) ఎంపీ సంజయ్‌ రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది.

Published : 25 Apr 2024 04:53 IST

దిల్లీ: శివసేన (ఉద్ధవ్‌) ఎంపీ సంజయ్‌ రౌత్‌ సన్నిహితుడు ప్రవీణ్‌ రౌత్‌కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. ముంబయి పాత్ర ఛాల్‌ పునరభివృద్ధి ప్రాజెక్టులో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. పాలఘర్‌, దాపోలీ, రాయగఢ్‌, ఠాణెలలో ప్రవీణ్‌ రౌత్‌తోపాటు మరి కొందరి స్థిరాస్తులను జప్తు చేసినట్లు బుధవారం ఈడీ ప్రకటించింది. ఈ కేసులో అరెస్టయిన సంజయ్‌ రౌత్‌, ప్రవీణ్‌ రౌత్‌లు ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని