రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్‌కు క్లీన్‌చిట్‌

లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు భారీ ఊరట లభించింది.

Published : 25 Apr 2024 04:54 IST

ముంబయి: లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు భారీ ఊరట లభించింది. రూ.25 వేల కోట్ల విలువైన సహకార బ్యాంకు కుంభకోణం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెకు ముంబయి పోలీసులు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. ఈ కేసుపై జనవరిలో ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) సమర్పించిన ముగింపు నివేదికలోని పలు వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. 2007 నుంచి 2017 మధ్య సహకార బ్యాంకులో అవకతవకలు జరిగి రూ.25వేల కోట్ల నష్టం వాటిల్లిందంటూ ఆరోపణలు వచ్చాయి. చక్కెర కర్మాగారాలకు తక్కువ ధరలకు రుణాలు ముంజూరు చేసి ఎక్కువ ధరలకు వాటిని విక్రయించారని అజిత్‌ పవార్‌, ఆయన భార్యతో సహా మరో 70 మందిపై 2019లో ముంబయి పోలీసులు కేసు నమోదుచేశారు. బ్యాంకుకు నష్టం చేకూర్చే ఎలాంటి లావాదేవీలు జరగలేదని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. సునేత్రా పవార్‌, అజిత్‌కు సంబంధించిన లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని గుర్తించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని