తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్‌ మహిళకు బీఎస్‌ఎఫ్‌ సాయం

భారత్‌లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) తన మానవతా హృదయాన్ని చాటుకుంది.

Published : 29 Apr 2024 04:16 IST

ఈటీవీ భారత్‌: భారత్‌లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) తన మానవతా హృదయాన్ని చాటుకుంది. పశ్చిమబెంగాల్‌లోని నదియా జిల్లాలో శనివారం రాత్రి మహబుల్‌ మండల్‌ అనే వ్యక్తి మరణించాడు. అతని కూమర్తె, ఇతర బంధువులు బంగ్లాదేశ్‌లో నివాసముంటున్నారు. ఆమెకు తన తండ్రిని చివరిసారి చూసే అవకాశం కల్పించమని కోరుతూ ఓ వ్యక్తి బీఎస్‌ఎఫ్‌ను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన బీఎస్‌ఎఫ్‌ 4వ బెటాలియన్‌ అధికారులు బార్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌ (బీజీబీ)తో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆ కుమార్తెను, ఇతర కుటుంబ సభ్యులను భారత్‌ -బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన జీరో లైన్‌ వద్ద చివరి చూపు చూసేందుకు అనుమతించారు. తన తండ్రిని చివరిసారి చూసిన ఆమె కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం బీఎస్‌ఎఫ్‌ అధికారులకు కృతజ్ఞత తెలిపారు. తాజా ఘటనపై స్పందించిన బీఎస్‌ఎఫ్‌ పీఆర్‌ఓ ఏకే ఆర్య..సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారా కాసే బీఎస్‌ఎఫ్‌ ఎల్లప్పుడూ మానవత్వం, మానవతా విలువలకు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని