మాజీ రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్‌ సీఈవో

టెక్‌ బిలియనీర్‌, ‘బిల్ట్‌ రివార్డ్స్‌’ సీఈవో అంకుర్‌ జైన్‌, మాజీ మహిళా రెజ్లర్‌ ఎరికా హమ్మండ్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్‌ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది.

Published : 29 Apr 2024 04:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ బిలియనీర్‌, ‘బిల్ట్‌ రివార్డ్స్‌’ సీఈవో అంకుర్‌ జైన్‌, మాజీ మహిళా రెజ్లర్‌ ఎరికా హమ్మండ్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్‌ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. పెళ్లి చిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘మా జీవితాల్లో ఈ వేడుక ఎంతో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. అందుకు ఎక్కువ ఖర్చు లేకుండా సాధారణంగా వివాహం చేసుకున్నాం. అలంకరణల కోసం వేల డాలర్లు ఖర్చుచేయడం ఎందుకు? ప్రపంచంలోనే భిన్నమైన వాతావరణంలో పెళ్లి చేసుకోవడం కొత్త అనుభూతినిస్తోంది’’ అని అంకుర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈజిప్ట్‌ పిరమిడ్‌ వద్ద వారి వివాహం జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని