వాయవ్య భారతంలో వడగాల్పులు

విపరీత ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో వాయవ్య భారతం అల్లాడుతోంది. దిల్లీలోని నజఫ్‌గఢ్‌లో శుక్రవారం నమోదైన 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతే దేశంలో ఇప్పటివరకు అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది.

Published : 18 May 2024 04:57 IST

అత్యధికంగా నజఫ్‌గఢ్‌లో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

దిల్లీ: విపరీత ఉష్ణోగ్రతలు, వేడి గాలులతో వాయవ్య భారతం అల్లాడుతోంది. దిల్లీలోని నజఫ్‌గఢ్‌లో శుక్రవారం నమోదైన 47.4 డిగ్రీల ఉష్ణోగ్రతే దేశంలో ఇప్పటివరకు అత్యధికమని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్‌లోని 19, హరియాణాలోని 18, దిల్లీలోని 8, పంజాబ్‌లోని రెండు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయినట్లు పేర్కొంది. రాబోయే అయిదు రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందనీ, ఆయా రాష్ట్రాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులు హెచ్చరించారు. మానవులు, వారి అలవాట్లే వాతావరణంలో విపరీత మార్పులకు కారణమవుతున్నాయనీ.. దేశంలో కనీసం 54.3 కోట్ల మంది ప్రజలు ఒక్కరోజైనా అధిక ఉష్ణోగ్రతల బారిన పడతారని అమెరికాకు చెందిన కొందరు వాతావరణ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ప్రతి 30 సంవత్సరాకోసారి ఈ పరిస్థితి పునరావృతమవుతుందన్నారు. ఆసియా దేశాల్లోని పేదలపై ఈ విపరీత ఎండల ప్రభావం అధికంగా ఉందని మరికొందరు శాస్త్రవేత్తలు తేల్చారు. మన దేశంలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ గతంలోనే స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని