ఎయిరిండియా విమానానికి ప్రమాదం

ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురికావడంతో సర్వీసును రద్దు చేశారు. పుణె నుంచి 200 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం దిల్లీకి బయలుదేరేందుకు ఆ విమానం రన్‌వే పైకి వచ్చింది.

Published : 18 May 2024 04:57 IST

200 మంది ప్రయాణికుల అవస్థ

పుణె: ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురికావడంతో సర్వీసును రద్దు చేశారు. పుణె నుంచి 200 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం దిల్లీకి బయలుదేరేందుకు ఆ విమానం రన్‌వే పైకి వచ్చింది. ఈ క్రమంలో లగేజీ తరలించే వాహనాన్ని ఢీకొట్టింది. విమానం ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక గంటపాటు ప్రయాణికులంతా లోపలే కూర్చుండిపోయారు. ఆ తర్వాత పైలెట్‌ సూచనతో అందరూ దిగిపోయారు. ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు సర్వీసును రద్దు చేయడంతో పూర్తి టికెట్‌ డబ్బులను తిరిగి చెల్లించారు. కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ అందుకోవాల్సిన వారిని వేరే సంస్థ సర్వీసుల్లో దిల్లీకి పంపించారు. అనుకోని సంఘటనతో ప్రయాణికులంతా ఆరు గంటలపాటు విమానాశ్రయంలోనే ఎదురుచూడాల్సి వచ్చింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు