సోరెన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈడీకి సుప్రీం నోటీసులు

లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారానికల్లా స్పందన తెలపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 18 May 2024 05:11 IST

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా మధ్యంతర బెయిల్‌ కోరుతూ ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారానికల్లా స్పందన తెలపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సోరెన్‌కు బెయిలిస్తే జూన్‌ రెండున లొంగిపోతారని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. దీన్ని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వ్యతిరేకించారు. రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసినా, సోరెన్‌ సవాల్‌ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్‌ను మంగళవారం వెకేషన్‌ బెంచ్‌ విచారించనుంది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో జనవరి 31న ఈడీ సోరెన్‌ను అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని