పోలింగ్‌ శాతాలపై అధికారిక సమాచారాన్ని 48 గంటల్లో ఎందుకు ఇవ్వలేరు?

సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్‌ శాతాలపై కచ్చితమైన అధికారిక సమాచారాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నను సంధించింది.

Published : 18 May 2024 05:13 IST

ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల వివిధ దశల్లో నమోదవుతున్న పోలింగ్‌ శాతాలపై కచ్చితమైన అధికారిక సమాచారాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సకాలంలో ఇవ్వలేకపోవడంపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నను సంధించింది. పోలింగ్‌ పూర్తయిన 48 గంటల్లోగా ఓటింగ్‌ శాతాల డేటాను ఆయా నియోజకవర్గాల వారీగా ఈసీ వెబ్‌సైట్‌లో ఎందుకు ఉంచలేకపోతున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిలదీసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 24వ తేదీకి వాయిదా వేసింది. అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల ప్రథమ, ద్వితీయ దశల పోలింగ్‌ శాతాలను అధికారికంగా వెల్లడించడంలో తీవ్ర జాప్యం జరగడం, ఆ గణాంకాలను పదే సవరించడంపై సందేహాలు తలెత్తడంతో పాటు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ సమగ్ర డేటాను 48 గంటల్లోగా ఈసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేలా ఆదేశించాలని ఏడీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని