అమ్మాయి చదువు ఇంటికి వెలుగు

ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు.   ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు.

Published : 19 May 2024 04:18 IST

పదిలో 492 మార్కులు సాధించిన విద్యార్థిని
ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం


విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చిన అనంతరం స్విచ్‌ వేస్తున్న దుర్గాదేవి

చెన్నై, న్యూస్‌టుడే: ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు.   ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా కోరడాచ్చేరి ప్రభుత్వ బాలిక మహోన్నత పాఠశాలలో బాలా-సుధా దంపతుల కుమార్తె దుర్గాదేవి 10వ తరగతిలో 500కు గాను 492 మార్కులు సాధించి.. పాఠశాలలో మొదటిస్థానం, జిల్లా స్థాయిలో రెండోస్థానంలో నిలిచింది. తండ్రి మెకానిక్‌. దుర్గాదేవి మాట్లాడుతూ.. విద్యుత్‌ సౌకర్యం లేకుండా ఏళ్లుగా తాము గుడిసెలో ఉంటున్నామని తెలిపింది. ఛార్జింగ్‌ లైట్, కొవ్వొత్తి వెలుగులోనే చదివానని పేర్కొంది. గతంలో విద్యుత్‌ కనెక్షన్‌ ఉన్నా.. బిల్లు కట్టే స్తోమత లేకపోవడంతో చాలా ఏళ్ల కిందటే తీసేశారని ఆవేదన వ్యక్తం చేసింది. కనెక్షన్‌ ఇవ్వాలని ఇటీవల ఆమె ప్రభుత్వానికి విన్నవించింది. విషయం తెలుసుకున్న తిరువారూర్‌ ఎమ్మెల్యే పూండి కలైవానన్, విద్యుత్‌ అధికారులు.. నేరుగా విద్యార్థిని ఇంటికి వెళ్లి పరిశీలించారు. మూడు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి కనెక్షన్‌ ఇచ్చారు. వైద్యురాలు కావడమే తన లక్ష్యమని దుర్గాదేవి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని