దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి

యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సూచించారు.

Published : 19 May 2024 05:45 IST

ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సూచన

తిరువనంతపురం: యువతలో ఆధ్యాత్మిక భావం పెంపొందాలంటే దేవాలయాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సూచించారు. తిరువనంతపురంలోని శ్రీ ఉడియన్నూర్‌ దేవి ఆలయం సభ్యులు శనివారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఈ సత్కార సభకు యువత అధిక సంఖ్యలో హాజరవుతారని ఊహించాను. కానీ, ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. యువతరాన్ని ప్రార్థనా మందిరాల వైపు ఆకర్షితులయ్యేలా గ్రంథాలయాలను ఎందుకు ఏర్పాటు చేయకూడదు?’ అని తన ఆలోచనను పంచుకున్నారు. ఆలయాలు కేవలం పెద్దవారి కోసమే కాదని, యువత కూడా వచ్చేలా చేయడంతో వాటిని సమాజాన్ని మార్చే ప్రభావవంతమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇస్రో మాజీ ఛైర్మన్‌ జి.మాధవన్‌ నాయర్‌ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని