మాలీవాల్‌ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది

ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్‌ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది.

Published : 19 May 2024 05:49 IST

కేజ్రీవాల్‌ నివాసం నుంచి మరో వీడియో

దిల్లీ: ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌ ఆరోపణల నేపథ్యంలో.. శనివారం మరికొన్ని వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం కేజ్రీవాల్‌ నివాసం నుంచి పోలీసులు, భద్రతా సిబ్బంది ఆమెను బయటకు పంపిస్తున్నట్లు వాటిలో కనిపిస్తోంది. అందులో.. సిబ్బంది నుంచి ఆమె వదిలించుకునే ప్రయత్నం చేశారు.  ఆ రోజు దెబ్బలతో తాను నడవలేని స్థితికి చేరానంటూ, తన దుస్తులు చిరిగిపోయాయంటూ ఆమె చేసిన ఆరోపణలూ అవాస్తవమని తాజా వీడియో తేల్చిందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని