రాజకీయాలకు మేం అతీతం

సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా  రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి.

Published : 20 May 2024 04:07 IST

మమతా బెనర్జీ ఆరోపణలపై రామకృష్ణ మిషన్, భారత్‌ సేవాశ్రమం స్పందన

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు లబ్ధి చేకూర్చేలా  రాష్ట్రంలోని ప్రముఖ మఠాలకు చెందిన సాధువులు వ్యవహరిస్తున్నారన్న పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపణలపై ఆధ్యాత్మిక సంస్థలు ఆదివారం స్పందించాయి. రాజకీయాలకు తాము ఎల్లప్పుడూ దూరంగానే ఉంటామని, ఏ పార్టీ అభ్యర్థికీ ఓటు వేయాలని ఎన్నడూ సూచించలేదని తెలిపాయి. శనివారం మమతా బెనర్జీ ఎన్నికల సభలో మాట్లాడుతూ...‘రామకృష్ణ మిషన్‌కు చెందిన కొందరు సాధువులు అసన్‌సోల్‌లో భాజపా అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. బహరంపుర్‌లో భారత్‌ సేవాశ్రమ సంఘ సాధువు ఒకరు పోలింగ్‌ స్టేషన్‌లో కూర్చోవద్దని టీఎంసీ కార్యకర్తని ఆదేశించార’ని ఆరోపించారు. మమతా బెనర్జీ ఆరోపణలు తమను ఎంతగానో బాధించాయని రామకృష్ణ మిషన్, భారత్‌ సేవాశ్రమ సంఘ నిర్వాహకులు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఆధ్యాత్మిక, సమాజ సేవలో తాము నిమగ్నమై ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆధ్యాత్మిక సంస్థలపై, సాధువులపై ఎంతో గౌరవం ఉందని భాజపా నేత సువేందు అధికారి తెలిపారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని