పుదుచ్చేరి బీచ్‌లో సముద్ర స్నానానికి దిగిన తెలుగు యువకులకు వినూత్న దండన

చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్‌లో స్నానాలు నిషేధించింది.

Published : 20 May 2024 04:35 IST

యానాం, న్యూస్‌టుడే: చూసేందుకు ఎంతో అందంగా కనిపించే పుదుచ్చేరి సముద్ర తీరం గడిచిన ఐదేళ్లలో 60 మందిని బలితీసుకుంది. అక్కడి ప్రభుత్వం ఆ బీచ్‌లో స్నానాలు నిషేధించింది. పోలీసు హెచ్చరికలు పెడచెవిన పెట్టి సముద్రంలో దిగి స్నానం చేస్తున్న నలుగురు తెలుగు యువకులను, వారిని చిత్రీకరిస్తున్న మరో యువకుడిని పెరియకడై పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారికి వినూత్న దండన విధించారు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని, 2 గంటలపాటు సముద్రంలో ఎవరూ స్నానాలు చేయకుండా చూడాల్సిన బాధ్యతను అప్పగించారు. ఆ తర్వాత వారిని హెచ్చరించి వదిలేశారు. బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్న తెలుగు యువకులు పుదుచ్చేరికి వారాంత విహారం కోసం వచ్చి పోలీసులకు ఇలా దొరికిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని