అత్యంత పొట్టి మహిళతో ‘ది గ్రేట్‌ ఖలీ’ ముచ్చట్లు

‘ది గ్రేట్‌ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్‌ దలీప్‌ సింగ్‌ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు.

Published : 20 May 2024 04:35 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ‘ది గ్రేట్‌ ఖలీ’గా పేరుపొందిన వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ) స్టార్‌ దలీప్‌ సింగ్‌ రానా.. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా రికార్డు సృష్టించిన జ్యోతి అమ్గేని ఇటీవల కలిశారు. ఈ వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. వీడియోలో జ్యోతి ఆమ్గేను ఖలీ ఒంటి చేత్తో సరదాగా పైకి ఎత్తగా.. ఆమె చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. వీరిద్దరూ ఇలా ఒకే చోట కనిపించడం చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘వారిద్దరూ చాలా సరదాగా ఉన్నారు..’  ‘ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఇప్పటి వరకూ 92 మిలియన్ల వీక్షణలు, రెండు మిలియన్లకుపైగా లైక్‌లు పొందింది. 1993 డిసెంబరు 6న మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జన్మించిన జ్యోతి ఆమ్గే 62.8 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరిగారు. ఆమె ఎత్తు 2 ఏళ్ల పిల్లల కంటే తక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని