ఎయిర్‌ ఇండియా విమానంలో మంటలు

బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఇంజిన్‌లో మంటలు రేగాయి.

Published : 20 May 2024 04:57 IST

బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్‌

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఇంజిన్‌లో మంటలు రేగాయి. దీంతో ఆకాశంలోకి ఎగిరిన కొన్ని నిమిషాల్లోనే బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా కిందకు దించారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని.. ఎవరూ గాయపడలేదని సదరు విమానయాన సంస్థ స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన సంభవించగా.. విమానం దిగిన వెంటనే అగ్నిమాపకదళ సిబ్బంది మంటల్పి ఆర్పారు. విమానంలో 179 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా.. మరో విమానంలో వారిని కొచ్చి పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని