ఈవీఎం ఎన్‌క్లోజరుకు పూల దండ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై కేసు

ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్‌పై త్రయంబకేశ్వర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 21 May 2024 05:48 IST

 నాసిక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఘటన

నాసిక్‌: ఐదో విడత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సోమవారం మహారాష్ట్ర నాసిక్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఆధ్యాత్మిక గురువు, స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్‌పై త్రయంబకేశ్వర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. త్రయంబకేశ్వర్‌లోని ఎంవీపీ కళాశాలలోని పోలింగ్‌ బూత్‌కు ఆయన 25 నుంచి 30 మంది అనుచరులతో వచ్చారు. ఓటు వేసే ముందు ఆయన మెడలోని పూల దండను తీసి ఈవీఎం ఎన్‌క్లోజరుకు వేశారు. దీనిపై పోలింగ్‌ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని