పాదరక్షల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు.. ఆగ్రాలో రూ.57 కోట్ల నగదు స్వాధీనం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.

Published : 21 May 2024 05:49 IST

 ఆగ్రా, దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే కొందరు పాదరక్షల వ్యాపారుల కార్యాలయాలు, వారి అనుబంధ సంస్థల్లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు శనివారం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో సుమారు రూ.57 కోట్ల లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారవర్గాలు సోమవారం తెలిపాయి. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించాయి. పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు వెల్లడించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని