భారత్‌లోనూ కొత్తగా కొవిడ్‌ కేసుల నమోదు

ఇప్పటికే సింగపూర్‌ను కుదిపేస్తున్న కేపీ.1, కేపీ.2 వేరియంట్లు.. తాజాగా మన దేశానికీ విస్తరించాయి. భారత్‌లో కేపీ.2 వేరియంట్‌ కేసులు 290, కేపీ.1 వేరియంట్‌ కేసులు 34 నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Published : 22 May 2024 05:57 IST

దిల్లీ: ఇప్పటికే సింగపూర్‌ను కుదిపేస్తున్న కేపీ.1, కేపీ.2 వేరియంట్లు.. తాజాగా మన దేశానికీ విస్తరించాయి. భారత్‌లో కేపీ.2 వేరియంట్‌ కేసులు 290, కేపీ.1 వేరియంట్‌ కేసులు 34 నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పౌరులు కంగారు పడాల్సిన అవసరం లేదనీ, ఇవన్నీ జేఎన్‌1 సబ్‌వేరియంట్లేనని.. వైరస్‌లో మ్యుటేషన్లు సాధారణమేనని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియన్‌ సార్స్‌-కోవ్‌2 జీనోమిక్స్‌ కన్సార్షియం సభ్యులు ఎప్పటికప్పుడు ఈ వైరస్‌ సోకిన వారి నుంచి నమూనాలు సేకరిస్తూ.. దాని ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారని తెలిపింది. కేపీ.1 కేసులు అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌ 23 నమోదయ్యాయి. కేపీ.2 కేసులు మాత్రం ఎక్కువగా మహారాష్ట్ర(148)లో వెలుగుచూశాయి. సింగపూర్‌లో ఈ కొత్త వేరియంట్ల ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడ మే 5 నుంచి 11 వరకు ఏకంగా 25,900 కేసులు నమోదవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు